అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు

  • అంబటిపై కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు
  • అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో దీక్ష నిర్వహించారంటూ కేసు
  • ఇప్పటికే రెండు కేసుల్లో 17 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న అంబటి 

వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. సత్తెనపల్లి లక్కీడ్రా, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యల కేసుల నుంచి ఇప్పుడిప్పుడే కొంత రిలాక్స్ అవుతున్న ఆయనపై మరో కొత్త కేసు నమోదైంది. 


కేసు వివరాల్లోకి వెళితే... తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షే ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదుకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో దీక్ష నిర్వహించడమే కాకుండా, తద్వారా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలతో నగరంపాలెం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.


ఇప్పటికే సత్తెనపల్లి లక్కీడ్రా ఉదంతం, చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసుల్లో అంబటి రాంబాబు 17 రోజుల పాటు రిమాండ్‌లో ఉండి, బెయిల్‌పై విడుదలయ్యారు. బయటకు వచ్చిన కొన్ని రోజులకే నిరసన దీక్ష పేరిట నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై మళ్లీ కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొత్త కేసు నమోదు కావడంపై అంబటి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Ambati Rambabu
YSRCP
Case

More Telugu News